'పెద్ది' పైరసీ బారినపడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
- యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసిన మద్రాస్ హైకోర్టు
- చట్టవిరుద్ధంగా ఇంటర్నెట్లో చిత్రాన్ని అప్లోడ్ చేయవద్దన్న హైకోర్టు
- సినిమా అనధికారికంగా లీక్ అయితే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందన్న హైకోర్టు
రామ్ చరణ్ హీరోగా వచ్చే నెలలో విడుదలవుతున్న 'పెద్ది' చిత్రం ఆన్లైన్ పైరసీకి అడ్డుకట్ట వేయడానికి మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్లో ఈ చిత్రాన్ని చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేయకూడదని, కాపీ చేయకూడదని, ప్రసారం చేయకూడదని, విడుదల చేయకూడదంటూ కోర్టు పైరసీ నిరోధక ఉత్తర్వులను జారీ చేసింది.
సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్ ద్వారా లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది. అందుకే ఈ సినిమాకు యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసినట్లు తెలిపింది.
ఏమిటీ యాంటీ పైరసీ ఇంజంక్షన్?
కాపీరైట్ హక్కుదారులు తమ సినిమా లేదా వెబ్ సిరీస్ కంటెంట్లు అక్రమంగా కాపీకాకుండా, పైరసీ వెబ్ సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఒక న్యాయపరమైన రక్షణ ఉత్తర్వు ఈ యాంటీ పైరసీ ఇంజంక్షన్. ఒక వెబ్ సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే కొత్త యూఆర్ఎల్తో అదే కంటెంట్ రాకుండా కొత్త సైట్లను కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ డైనమిక్ ఇంజంక్షన్ ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి.